ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ MINI, తన కొత్త Electric Car MINI Cooper SEను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరను రూ.54 లక్షలుగా నిర్ణయించింది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం లుక్‌తో ఆటోమొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

MINI Cooper SE పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లతో రూపొందించిన ఈ కారు లగ్జరీ EV సెగ్మెంట్‌లో పోటీకి సిద్ధమైంది.

కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కారు Deliveries డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. రూ.54 లక్షల ధరతో భారత EV మార్కెట్లోకి వచ్చిన MINI Cooper SEకి వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.