మియాపూర్ 550 ఎకరాల భూముల వివాదం | Supreme Court కీలక తీర్పు
హైదరాబాద్ Real Estate Historyలో కీలక పరిణామం!
మియాపూర్లోని Survey Number 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల 39 గుంటల భూములపై తెలంగాణ ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు ఉన్నాయని Supreme Court స్పష్టం చేసింది.
ఈ భూములపై ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన Appealsను కొట్టివేస్తూ 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ High Court ఇచ్చిన తీర్పును సమర్థించింది.
అసలు ఈ వివాదానికి 1912 Land Survey నుంచే పునాది పడింది. అప్పటి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూములు Sarkari Porambokeగా నమోదయ్యాయి.
నిజాం కాలంలో ఉన్న Jagir Rights ద్వారా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లభించవని, 1949 Jagir Abolition Act ద్వారా Jagir వ్యవస్థ రద్దయిన తర్వాత భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయని కోర్టు గుర్తించింది.
అంతేకాదు, చట్టబద్ధమైన ఆధారాలు లేని Pahani Entries, Revenue Records ఆధారంగా Private Ownership కోరడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
1912 Survey నుంచి 2026 Supreme Court Verdict వరకు సాగిన ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో చివరకు ప్రభుత్వ హక్కులను సుప్రీంకోర్టు సమర్థించింది.
ప్రజా ఆస్తుల పరిరక్షణే లక్ష్యం.. వాస్తవాలే మా వార్తలకు ఆధారం!
మీ సందేశ్ టీవీ – ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది!
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment