బాచుపల్లి పరిధిలో కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం?
కాంగ్రెస్ నేత కారుకు నిప్పంటించిన గుర్తుతెలియని దుండగులు
బాచుపల్లి: బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త నర్సారెడ్డి వీరారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బౌరంపేట్‌లోని తన కార్యాలయంలో వీరారెడ్డి ఉండగా, గుర్తుతెలియని దుండగులు ముందుగా కార్యాలయం పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం.
అనంతరం కార్యాలయం వద్దకు చేరుకున్న దుండగులు వీరారెడ్డికి చెందిన కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన వీరారెడ్డి గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
ఈ ఘటనలో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివాదం ఉందా? లేక ముందస్తు పథకంలో భాగంగానే దాడికి యత్నించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే బాచుపల్లి ఎస్‌హెచ్‌ఓ డాల్ నాయుడు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను సేకరిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం.
Watch The Video