వైద్య ప్రవేశాలలో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ల కలకలం రేగింది. తెలంగాణలోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో (KNRUHS) ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు ఎస్టీ రిజర్వేషన్ కోటాను ఆశించి నకిలీ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నట్లు యూనివర్సిటీ గుర్తించింది.
ఈ దర్యాప్తులో భాగంగా నకిలీ సర్టిఫికెట్లతో అప్లై చేసిన 37 మందిని గుర్తించగా, ఇప్పటికే సీట్లు పొందిన 9 మంది విద్యార్థుల ఎంబీబీఎస్ ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సందేశ్ టీవీ (Sandesh TV) ప్రత్యేక కథనాన్ని వీక్షించండి!
Watch The Video