భారత Para Athletes Asian Para Games 2026లో చరిత్ర సృష్టించారు. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరిగిన ఈ క్రీడల్లో భారత్ తన అత్యుత్తమ ప్రదర్శనతో మొత్తం 114 Medals సాధించింది. ఇందులో 30 Gold, 35 Silver, 49 Bronze Medals ఉన్నాయి. ఈ రికార్డు ప్రదర్శనతో Medal Tallyలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. గతంలో 2023 హాంగ్‌జౌ Asian Para Gamesలో సాధించిన 108 మెడల్స్ రికార్డును భారత్ అధిగమించింది.

ఈ విజయాల్లో ఆర్చరీ స్టార్ షీతల్ దేవి (Sheetal Devi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళల Compound Individual విభాగంలో Gold Medal సాధించిన ఆమె, అనంతరం టోమన్ కుమార్ (Toman Kumar)తో కలిసి Mixed Team Compound ఈవెంట్‌లోనూ స్వర్ణం గెలిచింది. ఇలా ఒకే రోజు రెండు Gold Medals సాధించి భారత పతకాల సంఖ్యను పెంచింది. మరోవైపు, పురుషుల Javelin Throwలో సుమిత్ ఆంటిల్ (Sumit Antil) స్వర్ణం సాధించగా, సందీప్ సర్గర్ (Sandip Sargar), మహేంద్ర గుర్జర్ (Mahendra Gurjar) కూడా పతకాలు సాధించడంతో భారత్ ఈ విభాగంలో మూడు మెడల్స్‌ను కైవసం చేసుకుంది.

మొత్తంగా భారత అథ్లెట్లు Para Athletics, Para Badminton, Para Archery, Para Shooting సహా పలు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా Para Athletics విభాగం నుంచి అత్యధికంగా 65 మెడల్స్ రావడం విశేషం. ఈ రికార్డు మెడల్ హాల్ భారత Para Sports అభివృద్ధికి, క్రీడాకారుల పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. దేశం గర్వపడేలా ప్రదర్శన ఇచ్చిన అథ్లెట్లకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. మరిన్ని Sports News, Athletics Updates కోసం Sandesh TV Telugu ఛానల్‌ను Subscribe చేసుకోండి.