అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేపై పోలీసుల దురుసు ప్రవర్తన: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణ శాసనసభ సమావేశాల వేళ రాజకీయ రణరంగం సృష్టించబడింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ తోపులాటలో కేటీఆర్ సహా పలువురు నేతలకు గాయాలయ్యాయి. అత్యంత షాకింగ్ పరిణామంగా, అసెంబ్లీ గేట్ల వద్ద పోలీసులు తన పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించారని, చీర లాగి అవమానించారని మాజీ మంత్రి, మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల ఈ తీరుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.  

Watch The Video