నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం (Ramayana)’ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ ఎపిక్ మూవీకి సంబంధించి కొత్త క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. బాలీవుడ్ నటి లారా దత్తా (Lara Dutta) రాణి కైకేయి పాత్రలో, నటి షీబా చద్దా (Sheeba Chadha) మంథర పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రల పోస్టర్లు విడుదల కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. Ramayana Part 1 దీపావళి 2026 సందర్భంగా విడుదల కానుండగా, Ramayana Part 2 దీపావళి 2027కు విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది. గ్రాండ్ విజువల్స్, భారీ తారాగణం, ప్రతిష్టాత్మక నిర్మాణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తోంది.