సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తుంకుంట అటవీ ప్రాంతంలో జరిగిన మున్నూరు శ్రీనివాస్ హత్య కేసును చిరాగ్‌పల్లి పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జహీరాబాద్ టౌన్ CI ఆర్. రవి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 8న నమోదైన Missing Case ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, పలు కోణాల్లో విచారణ జరిపి హత్య వెనుక ఉన్న నిందితులను గుర్తించారు.
పోలీసుల విచారణలో మృతుడి అల్లుడు ఎర్ర బసవరాజు కుటుంబ కలహాలు, 498 కేసు పెట్టిందనే కక్షతో తన మామను హత్య చేయించేందుకు రూ.5 లక్షల Supari ఇచ్చినట్లు వెల్లడైంది. తన స్నేహితులతో కలిసి ఈ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మృతదేహంతో పాటు ఆటోపై Petrol పోసి నిప్పంటించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
ఈ Murder Caseలో పోలీసులు నలుగురు నిందితులను Arrest చేశారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల Cash, Mobile Phones, హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన చిరాగ్‌పల్లి పోలీసుల దర్యాప్తు వివరాలు, ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు మరియు నిందితుల అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ప్రత్యేక Crime Reportను Sandesh TVలో వీక్షించండి.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment