Monday, January 19, 2026 | Sandesh TV Daily News
Logo

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట: డీఏ పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

news.title

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (DA) పెంపును ప్రకటిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 30.03 శాతం డీఏను 33.67 శాతానికి పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు వెలువరించారు. ఈ పెంపు జూలై 1, 2023 నుండి వెనుకటి తేదీతో (Retrospectively) వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరెవరికి వర్తిస్తుంది? ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, 2016 ఏఐసీటీఈ (AICTE) లేదా యూజీసీ (UGC) వేతన స్కేల్స్ పొందుతున్న ఉద్యోగులకు డీఏను 42 శాతం నుండి 46 శాతానికి పెంచారు. ఈ పెంపు కేవలం ప్రభుత్వ శాఖలకే పరిమితం కాకుండా: జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలు జిల్లా గ్రంథాలయ సంస్థలు విశ్వవిద్యాలయాల్లోని బోధన మరియు బోధనేతర సిబ్బందికి కూడా వర్తించనుంది. చెల్లింపు విధానం సవరించిన డీఏను 2026 జనవరి నెల జీతంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. ఇక జూలై 1, 2023 నుండి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న డీఏ బకాయిలను (Arrears) ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖజానాపై రూ. 227 కోట్ల భారం ఈ డీఏ పెంపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి నెలా రూ. 227 కోట్ల అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.