Wednesday, January 21, 2026 | Sandesh TV Daily News
Logo

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరులో కేంద్రం వివక్ష: కేటీఆర్ తీవ్ర ధ్వజం

news.title

రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్, జనవరి 19: రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ నేతన్నలపై కేంద్రం "రాజకీయ కక్ష" సాధిస్తోందని ఆయన మండిపడ్డారు. #TelanganaWeavers #Sircilla కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు రాసిన లేఖలో కేటీఆర్ పలు కీలక అంశాలను లేవనెత్తారు. 'మెగా పవర్‌లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీమ్' (CPCDS) కింద సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, గత పదేళ్లుగా ఈ ప్రతిపాదనను కేంద్రం పెండింగ్‌లో పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా నిరీక్షణ గత 12 ఏళ్లుగా అప్పటి మంత్రులు అరుణ్ జైట్లీ, స్మృతి ఇరాని నుంచి నేటి మంత్రి వరకు తాను పది సార్లు నేరుగా కలిసి నివేదికలు ఇచ్చానని కేటీఆర్ గుర్తు చేశారు. #PoliticalVendetta "కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సిరిసిల్లకు అర్హత ఉందని ధృవీకరించిన తర్వాత కూడా ఫైళ్లను పక్కన పెట్టడానికి కారణం కేవలం రాజకీయ వివక్షే," అని ఆయన విమర్శించారు. సిరిసిల్ల ప్రత్యేకత - కేంద్రం నిర్లక్ష్యం సిరిసిల్లలో 30,000 కంటే ఎక్కువ పవర్‌లూమ్స్ ఉన్నాయి, ఇవి వేలాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. తక్కువ సామర్థ్యం ఉన్న ఇతర రాష్ట్రాలకు క్లస్టర్లు మంజూరు చేసిన కేంద్రం, దేశానికే వస్త్ర కేంద్రంగా ఉన్న సిరిసిల్లను విస్మరించడం అన్యాయమని కేటీఆర్ పేర్కొన్నారు. #MakeInIndia కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయింపు, నిరంతర విద్యుత్, నీటి సరఫరా మరియు సింగిల్ విండో క్లియరెన్స్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. నేతన్నల ఆత్మహత్యలపై ఆవేదన కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల నేతన్నల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, మళ్లీ నేతన్నల ఆత్మహత్యల వార్తలు వినరావడం బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. "మేక్ ఇన్ ఇండియా", "ఆత్మనిర్భర్ భారత్" అని నినాదాలు ఇచ్చే బీజేపీ, వాస్తవానికి చేతల్లో మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటోందని ఎద్దేవా చేశారు. #SaveSircillaWeavers ఎంపీలపై విమర్శలు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని, వారు కేవలం "అలంకారప్రాయంగా" మిగిలిపోయారని కేటీఆర్ విమర్శించారు. #AtmanirbharBharat డిమాండ్: రాబోయే కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను అధికారికంగా ప్రకటించాలని, నేతన్నల గోసను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. #UnionBudget2026 #rajanna #siricilla