Wednesday, February 4, 2026 | Sandesh TV Daily News
Logo

బిగ్ బ్రేకింగ్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. ఇంటి గోడకు అంటించిన అధికారులు!

news.title

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు (KCR) కు నోటీసులు జారీ చేసింది. శనివారం సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి వెళ్లి, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. #TelanganaPolitics #KCR విచారణకు హాజరు కావాలని ఆదేశం: ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే అభియోగాలపై సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో కేసీఆర్‌ను విచారించేందుకు అధికారులు నిర్ణయించారు. నోటీసుల్లో పేర్కొన్న తేదీన విచారణకు హాజరై, అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిట్ స్పష్టం చేసింది. #PhoneTappingCase #SITInvestigation భగ్గుమన్న బీఆర్ఎస్: కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ (BRS) శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్య (Political Vendetta) అని బీఆర్ఎస్ సీనియర్ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి, ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందని వారు ఆరోపించారు. #BRSVsCongress #PoliticalVendetta ముందుంది ముసళ్ళ పండుగ? ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేయడంతో, రానున్న రోజుల్లో అరెస్టులు ఉంటాయా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ ఈ నోటీసులపై న్యాయపరంగా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. #TelanganaNews #Hyderabad #KCRSummoned #SITNotice #RevanthReddy #TelanganaPolice #LatestNewsTelugu #PoliticalHeat #BRSParty