Wednesday, June 17, 2026 | Sandesh TV Daily News
Logo

తుమ్మిడిహట్టిపై రేవంత్ రెడ్డి డ్రామాలు ఆపాలి: కాంగ్రెస్ సర్కార్‌పై కవిత నిప్పులు!

news.title

హైదరాబాద్: ప్రతిష్టాత్మక తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కాలయాపన వైఖరిపై టీఆర్ఎస్ (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే, కాలయాపన చేయడం ఆపి వెంటనే తుమ్మిడిహట్టి పనులను ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు సీఎం రేవంత్ రెడ్డి పాలనా తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. సాకులు చెప్పడం ఆపండి! తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతోనే ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరలేపిందని కవిత ఆరోపించారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే తెలంగాణ రైతాంగంపై, ప్రాజెక్ట్‌లపై నిజాయితీ ఉంటే.. గతంలో కుదిరిన 148 మీటర్లకు ఉన్న ఒప్పందం ప్రకారమే పనులు వెంటనే మొదలుపెట్టాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ కట్టే ఉద్దేశం ఏమాత్రం లేదు. అందుకే పక్క రాష్ట్ర మహారాష్ట్ర సీఎం పేరు చెప్తూ లేనిపోని సాకులు వెతుకుతున్నారు" అని కవిత ధ్వజమెత్తారు. కాలయాపన చేస్తే ఊరుకోం! మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చల పేరుతో ప్రాజెక్ట్‌ను మూలనపడేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, సాకుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గత ఒప్పందాల ప్రకారం పనులు ప్రారంభించకుండా ఉత్తర కుమార ప్రగల్భాలు పలికితే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకుని, ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి తుమ్మిడిహట్టి నిర్మాణ పనులపై తక్షణమే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. Hashtags: #Kavitha #CMRevanthReddy #ThummidihattiProject #TelanganaPolitics #CongressGovernment #TRSKavitha #TelanganaNews #IrrigationProjects #RevanthReddy #TelanganaRaitu #Adilabad