Monday, June 22, 2026 | Sandesh TV Daily News
Logo

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక భేటీ!

news.title

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కర్తవ్య భవన్‌లో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన మౌలిక సదుపాయాలు, రక్షణ రంగానికి చెందిన అభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ----- గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూములపై కృతజ్ఞతలు-----హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 'గాంధీ సరోవర్ ప్రాజెక్టు' కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదిలీ చేయడానికి సహకరించినందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -------ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణే ప్రధాన ఎజెండా-------ఈ భేటీలో ప్రధానంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఆధ్వర్యంలో ఇక్కడ చేపడుతున్న ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి, అవసరమైన భూసేకరణ మరియు యుటిలిటీల మార్పిడికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ టెర్మినల్: రక్షణ అవసరాలతో పాటు సామాన్య ప్రయాణికుల కోసం సివిల్ ఏవియేషన్ టెర్మినల్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. గ్లోబల్ ఏవియేషన్ హబ్: కార్గో సదుపాయాలు, MRO (మెయింటెనెన్స్, రిపేర్ & ఓవర్‌హాల్) సర్వీసులు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్ల ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ అవకాశాలు: అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో, గ్లోబల్ ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ హ్యాంగర్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అత్యంత అనుకూలమైన వేదికగా మారుతుందని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ------ మహబూబ్‌నగర్‌లో DRDO/DRDL ప్రాజెక్ట్------- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ప్రతిపాదించిన రక్షణ పరిశోధన సంస్థలకు చెందిన కీలకమైన DRDO / DRDL ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం తెలపాలని రేవంత్ రెడ్డి రక్షణ మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ వ్యూహాత్మక మరియు ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు, కార్యదర్శి మాణిక్ రాజ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #Hashtags: #RevanthReddy #RajnathSingh #TelanganaGovernment #DelhiTour #AdilabadAirport #GandhiSarovar #DRDO #Mahabubnagar #TelanganaDevelopment #AviationHub #TelanganaNews #DefenceMinistry