Monday, September 14, 2026 | Sandesh TV Daily News
Logo

గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సరికొత్త అడుగు.. ‘ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్స్’ తో చేతులు కలిపిన TGTWREIS!

news.title

హైదరాబాద్: తెలంగాణలోని గిరిజన గుర్కుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు మరియు వారి అభ్యసనా సామర్థ్యాలను (Learning Outcomes) బలోపేతం చేసేందుకు ఒక కీలక అడుగు పడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ నివాస విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) ప్రముఖ విద్యా స్వచ్ఛంద సంస్థ 'ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్స్' (Transform Schools) తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. విద్యా లోపాలను అధిగమించడమే లక్ష్యం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గిరిజన విద్యార్థులలో ఉండే విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని, అభ్యసన లోపాలను (Learning Gaps) అధిగమించడానికి ఈ సరికొత్తు ప్రోగ్రామ్ దోహదపడనుంది. తరగతి గదిలో కేవలం సిలబస్ పూర్తి చేయడం మాత్రమే కాకుండా, ప్రతి విద్యార్థి ప్రాథమికాంశాలపై పట్టు సాధించేలా ప్రత్యేక బోధనా పద్ధతులను ఈ భాగస్వామ్యం ద్వారా ప్రవేశపెట్టనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా చేపట్టే కీలక చర్యలు: సమర్థవంతమైన బోధన (Targeted Instruction): విద్యార్థుల ప్రస్తుత అభ్యసన స్థాయిలను గుర్తించి, దానికి అనుగుణంగా ప్రత్యేక 'స్టూడెంట్ హ్యాండ్‌బుక్స్', 'టీచర్ గైడ్స్' ద్వారా సులభమైన పద్ధతుల్లో బోధన అందిస్తారు. ఉపాధ్యాయులకు శిక్షణ: గిరిజన గురుకులాల్లోని ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతులు, తరగతి గది నిర్వహణ (Classroom Management), మరియు డిజిటల్ టూల్స్ వినియోగంపై 'ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్స్' నిపుణులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. నాయకత్వ నైపుణ్యాల పెంపు: పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (Principals/Head Teachers) స్కూల్ మేనేజ్‌మెంట్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా లీడర్‌షిప్ ప్రోగ్రామ్స్‌ను కూడా ఇందులో భాగంగా అమలు చేయనున్నారు. లింగ సమానత్వం & లైఫ్ స్కిల్స్: ముఖ్యంగా గిరిజన బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, వారి ఉన్నత విద్యకు ఆటంకం కలిగించే సామాజిక అడ్డంకులను అధిగమించేలా లైఫ్ స్కిల్స్ (Life Skills) వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. డ్రాపౌట్స్‌కు అడ్డుకట్ట చాలా సందర్భాల్లో పాఠశాలల్లో సబ్జెక్టులు అర్థం కాకపోవడం వల్లే విద్యార్థులు చదువు మధ్యలో ఆపేస్తుంటారు (School Dropouts). TGTWREIS మరియు ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్స్ సంయుక్తంగా తీసుకుంటున్న ఈ చొరవ వల్ల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా, టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి బలమైన పునాది పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ గిరిజన గురుకులాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలలో అత్యుత్తమ గుర్తింపు తెచ్చుకోగా, ఈ సరికొత్త భాగస్వామ్యంతో గిరిజన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పోటీని తట్టుకునేలా రూపుదిద్దుకుంటారని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. #TGTWREIS #TransformSchools #TribalWelfareTelangana #GurukulSchools #TribalEducation #LearningOutcomes #TelanganaEducation #QualityEducation #EmpoweringTribalStudents #TelanganaNews