Sunday, June 28, 2026 | Sandesh TV Daily News
Logo

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్: మొదటి దశ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు!

news.title

హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, మొదటి దశ పనులను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ (MCRHRD) బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు: బాధితులకు ఆవాసం: మూసీ రివర్‌బెడ్ (నది పరివాహక ప్రాంతం)లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం అండగా నిలవాలని సీఎం నిర్ణయించారు. అక్కడ నివాసం ఉంటున్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన భూ సేకరణ: ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను పారదర్శకంగా చేపట్టాలని సీఎం సూచించారు. భూమిని ఇచ్చే వారికి ఆసక్తి మేరకు టీడీఆర్ (TDR) బాండ్లు లేదా ప్రభుత్వం నిర్దేశించిన పరిహారాన్ని చెల్లించాలని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ నుంచి సేకరిస్తున్న భూముల్లో ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించారు. మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్: నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం ప్రత్యేకంగా 'మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌'ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సెంటర్‌లో మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు, చేపట్టబోయే పనులను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ గారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు మొదటి దశ పనులకు సంబంధించి అధికారులు సీఎంకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. #MusiRiverFront #HyderabadDevelopment #CMRevanthReddy #MusiProject #TelanganaGovernment #UrbanDevelopment #HyderabadNews