🌧️ ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 💧 ప్రత్యేకించి నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఈ వానల ప్రభావం తీవ్రంగా ఉంది. నిర్మల్, కడెం, ఖానాపూర్, మంచిర్యాల, కాసిపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో పాటు కొన్నిచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 🚧 రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, దైనందిన కార్యకలాపాలు మందగించాయి. అలాగే సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తికి సైతం భారీగా అంతరాయం వాటిల్లినట్లు సమాచారం.⚠️ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని యంత్రాంగం సూచించింది.#HeavyRains #Adilabad #TelanganaNews #Nirmal #Mancherial #Monsoon2026 #WeatherUpdate #TelanganaWeather