Wednesday, January 21, 2026 | Sandesh TV Daily News
Logo

తెలంగాణలో చలి పంజా.. రాత్రివేళల్లో పెరగనున్న చలి తీవ్రత

news.title

హైదరాబాద్: - సందేశ్ టుడే- రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుంచి 3°C వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.పడిపోతున్న ఉష్ణోగ్రతలు:రాష్ట్రంలో ఇప్పటికే చలి పంజా విసురుతోంది. పటాన్‌చెరులో అత్యల్పంగా 8.2°C ఉష్ణోగ్రత నమోదవగా, ఆదిలాబాద్‌లో 9.2°C, రాజేంద్రనగర్‌లో 10°C గా నమోదైంది.ఆరోగ్య జాగ్రత్తలు:చలి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. సీజనల్ ఫ్లూ, శ్వాసకోశ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. సాధారణ ఫ్లూ ఉన్నవారు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.