Wednesday, January 21, 2026 | Sandesh TV Daily News
Logo

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: నేటి నుండే వార్షిక శీతాకాల విడిది ప్రారంభం

news.title

సందేశ్ టుడే - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుండి తన వార్షిక శీతాకాల విడిది (Southern Sojourn) కోసం విచ్చేసిన ఆమె, నేరుగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఈ నెల 22వ తేదీ వరకు, అంటే రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రపతి కార్యాలయం ఇక్కడి నుండే పనిచేస్తుంది. పర్యటనలోని ముఖ్య కార్యక్రమాలు: డిసెంబర్ 19: రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (PSC) ఛైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభిస్తారు. డిసెంబర్ 20: గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీలు నిర్వహించే "టైమ్‌లెస్ విస్డమ్ ఆఫ్ భారత్ – పాత్‌వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్" అనే సదస్సులో ఆమె పాల్గొంటారు. ఘన స్వాగతం: హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మినిస్టర్-ఇన్-వెయిటింగ్ అనసూయ సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. వీరితో పాటు సాయుధ దళాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా విమానాశ్రయంలో ఉన్నారు.