హమ్మయ్యా.. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు! హైదరాబాద్‌లో కురిసిన వర్షాలతో సున్నం చెరువు, మాదాపూర్‌లోని తమ్మిడికుంటలోకి వర్షపు నీరు చేరుతోంది. చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిన హైడ్రాకు ఇది శుభపరిణామంగా మారింది.
ఒకప్పుడు పూడికతో నిండిపోయి, దుర్వాసనతో ఇబ్బందులు కలిగించిన సున్నం చెరువులో పూడిక తొలగింపు, పరిసరాల అభివృద్ధి పనులు చేపట్టారు. వర్షపు నీరు ఇన్‌లెట్ల ద్వారా చెరువులోకి చేరుతుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మాదాపూర్‌లోని తమ్మిడికుంటలోనూ వర్షపు నీరు చేరుతోంది. చెరువుల్లో నీటి నిల్వలు పెరగడం భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతుందని అధికారులు, స్థానికులు ఆశిస్తున్నారు.
చెరువులు బాగుంటేనే భూగర్భ జలాలు బాగుంటాయి.. వర్షపు నీటిని ఒడిసిపడితేనే భవిష్యత్తుకు నీటి భరోసా!
సున్నం చెరువు, తమ్మిడికుంట నుంచి మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment