జపాన్లోని ఐచి-నగోయాలో జరిగిన Asian Para Games 2026లో భారత పారా అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో భారత్ రికార్డు స్థాయిలో మొత్తం 114 Medals సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. గతంలో 2023 హాంగ్జౌ Asian Para Gamesలో సాధించిన 108 పతకాల రికార్డును అధిగమించింది.
భారత్ సాధించిన 114 పతకాల్లో 30 Gold, 35 Silver, 49 Bronze Medals ఉన్నాయి. Para Athletics విభాగంలో అత్యధికంగా 65 పతకాలు లభించాయి. Para Badmintonలో 16, Para Swimmingలో 11, Para Table Tennisలో 7, Para Archeryలో 6, Para Shootingలో 5 పతకాలు సాధించారు. పలువురు అథ్లెట్లు World Records, Asian Records సృష్టించి దేశానికి గర్వకారణంగా నిలిచారు.
ఈసారి Asian Para Gamesలో 168 మంది భారత పారా అథ్లెట్లు పాల్గొనగా, 97 మంది అథ్లెట్లు పతకాలు సాధించడం విశేషం. చిన్న Contingentతోనే గత రికార్డును అధిగమించడం భారత Para Sports రంగంలో కీలక విజయంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయంతో అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత పారా అథ్లెట్లు మరోసారి తమ సత్తా చాటారు.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment