తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘Scene’ పైరసీకి మద్రాస్ హైకోర్టు అడ్డుకట్ట వేసింది. సినిమా అనుమతి లేకుండా కాపీ చేయడం, థియేటర్లలో Camcording చేయడం, Onlineలో Upload, Download, Streaming చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమాను Zhagaram Studios LLP నిర్మించి, పంపిణీ చేస్తోంది. సినిమా విడుదలకు ముందే పైరసీ ముప్పు పొంచి ఉందని Production House కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పీ.బి. బాలాజీ, గుర్తుతెలియని వ్యక్తులు, వెబ్‌సైట్లకు వ్యతిరేకంగా John Doe Injunction జారీ చేశారు.
అంతేకాకుండా సినిమా పైరసీకి పాల్పడే Websites, Mirror Websitesను Block చేయాలని Internet Service Providers (ISPs)ను కోర్టు ఆదేశించింది. సినిమా పూర్తి నిడివితో పాటు పాటలు, వీడియో క్లిప్స్‌ను కూడా అనధికారికంగా ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో Film Piracyపై చిత్ర పరిశ్రమ చేస్తున్న పోరాటానికి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment