తట్టి అన్నారం సమీపంలో మహిళ మృతదేహం కలకలం రేపింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాకింగ్‌కు వెళ్లిన కొందరు వ్యక్తులు మహిళ మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతింటున్న పరిస్థితిలో గుర్తించినట్లు సమాచారం.

మృతురాలిని OU మాణికేశ్వర్ నగర్‌కు చెందిన మంగమ్మగా పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 28 నుంచి మంగమ్మ కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం లభ్యమైన నేపథ్యంలో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మంగమ్మ మృతిపై అనుమానాస్పద పరిస్థితులు నెలకొనడంతో Police Investigation కొనసాగుతోంది. లైంగిక దాడి, హత్య జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. Post-Mortem Report అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పూర్తి Crime Report కోసం Sandesh TV Crimeను వీక్షించండి.

Watch The Video